ఇంట్లో ఎంత వరకు నగదును ఉంచుకోవచ్చు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 23 January 2023

ఇంట్లో ఎంత వరకు నగదును ఉంచుకోవచ్చు !


నగదు లావాదేవీలు సాంప్రదాయకంగా భారత ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నల్లధనం పేరుకుపోవడానికి నిరంతర కారణంగా మారుతోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నగదు లావాదేవీలపై ఎప్పటికప్పుడు పలు పరిమితులను విధించింది. ఈ పరిమితులకు మించి నగదును చెల్లించడం, స్వీకరించడం లేదా దాచుకోవడం వలన చెల్లించిన, స్వీకరించిన మొత్తంలో 100 శాతం వరకు జరిమానా విధించబడుతుంది. అయితే మీకు కూడా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు దాచుకునే అలవాటు ఉంటే వెంటనే ఈ విషయం తెలుసుకోండి. ఎందుకంటే మీపై ఐటీ అధికారుల కన్ను పడే అవకాశం ఉంది. దీంతో మీరు పెద్ద మొత్తంలో ఆర్ధిక నష్టాన్ని చూడాల్సి వస్తుంది. చాలా మంది వ్యాపారస్తులు తమ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు నిల్వ ఉంచుకుంటారు. తమకు అవసరమైనప్పుడు ఆ నగదును ఉపయోగించుకునేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే, ఇంట్లో నగదు పరిమితికి సంబంధించి దాచుకోవడం సరికాదని ఆదాయపు పన్ను శాఖ అంటోంది. ఇందు కోసం ఐటీ శాఖ కొన్ని నిబంధనలని జారీ చేసింది. ఇంట్లో ఎంత మొత్తంలో దాచుకోవచ్చనే మనలో చాలా మందికి తెలియదు. నా డబ్బు నా ఇష్టం అనేలా దాచుకుంటారు. వీటి గురించి తెలియక చాలామంది ఇబ్బందిపడుతున్నారు. ఒక ఆర్థిక ఏడాదికి రూ.20 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒకేసారి రూ.50వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడానికి లేదా విత్‌డ్రా చేయడానికి పాన్ నంబర్ అందించాలి. ఒక వ్యక్తి ఏడాదిలో రూ. 20 లక్షల నగదు డిపాజిట్ చేస్తే అతను పాన్, ఆధార్ సమాచారాన్ని అందించాలి. పాన్, ఆధార్ గురించి సమాచారం ఇవ్వకుంటే రూ.20 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదుతో షాపింగ్ చేయకూడదు. 2 లక్షలకు మించి నగదు రూపంలో కొనుగోళ్లు జరిపితే పాన్, ఆధార్ కార్డు కాపీని షాపు యజమానికి ఇవ్వాల్సి ఉంటుంది. రూ.30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు, అమ్మకాలు జరిపే వ్యక్తులు దర్యాప్తు సంస్థల పరిధిలోకి వస్తారు. స్వయం ఉపాధి పన్ను చెల్లింపుదారుల విషయానికి వస్తే ఒకే రోజులో ఒకే వ్యక్తికి నగదు రూపంలో చెల్లించినట్లయితే వారు రూ. 10 వేల కంటే ఎక్కువ ఖర్చును క్లెయిమ్ చేయలేరు. ట్రాన్స్‌పోర్టర్‌కి ఇచ్చిన చెల్లింపుల కోసం చట్టం రూ. 35 వేల అధిక థ్రెషోల్డ్‌ని ఏర్పాటు చేస్తుంది.

No comments:

Post a Comment