జమ్మూ కశ్మీర్ లో భూకంపం

Telugu Lo Computer
0


జమ్మూ కశ్మీర్ లో భూకంపం సంభవించింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు కిష్ట్ వార్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని తెలిపింది. దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోవడంతో అందూ ఊపిరి పీల్చుకున్నారు. జమ్మూ కశ్మీర్ లో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. గత 10 రోజుల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. జనవరి 1వ తేదీన 3.8 తీవ్రతతో ఢిల్లీలో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో జమ్మూ కశ్మీర్ లో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఈ నెల 5వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ లో 5.9శాతం భూకంప తీవ్రతతో భూమిలో కదలికలు వచ్చాయి. దీంతో జమ్మూ కశ్మీర్ తోపాటు ఢిల్లీలో కూడా భూకంపం సంభవించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)