శ్రీశైలంలో కర్ణాటక సీఎం, మాజీ సీఎం పర్యటన !

Telugu Lo Computer
0


కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప ఈరోజు  శ్రీశైలంలో పర్యటించారు.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న సీఎం, మాజీ సీఎం.. భ్రమరాంబికాదేవిని దర్శించుకోకుండానే వెళ్లిపోయారు.. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.. ఎందుకంటే.. అమ్మవారిని తమ ఆడపడుచుగా భావిస్తారు కన్నడిగులు.. కానీ, అమ్మవారిని దర్శించుకోకుండానే బసవరాజు బొమ్మై, యడ్యూరప్ప తిరిగి వెళ్లడంపై కన్నడిగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ సమయం కుదరదని ఫోన్ రావడంతో మల్లన్నను దర్శించుకుని వెనుదిరిగి వెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్పకు ఆలయ రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అర్చకులు.  ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, చైర్మన్, ఈవో కూడా స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు.. అంతకుముందు శ్రీశైల జగద్గురు పీఠాధిపతి ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రీయ జనజాగృతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చేపట్టిన అభివృద్ధి పనులకు కర్ణాటక ప్రభుత్వం తరఫున 5 కోట్ల రూపాయాల విరాళం ప్రకటించారు. కర్ణాటక సీఎంతో పాటు జగద్గురు పీఠం అభివృద్ధి పనులకు 10 లక్షలు విరాళం ప్రకటించారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. ఇక, అమ్మవారిని దర్శించుకోకుండానే శ్రీశైలంలో తమ పర్యటనను ముగించుకుని కాన్వాయ్ లో రోడ్డు మార్గం ద్వారా సున్నిపెంట హెలిప్యాడ్‌కు వెళ్లిన సీఎం, మాజీ సీఎం.. సున్నిపెంట హెలిప్యాడ్ నుండి తిరిగి బెంగళూరుకు బయల్దేరి వెళ్లిపోయారు.

Post a Comment

0Comments

Post a Comment (0)