హిజాబ్‌ను ధరించకపోవడం వల్లే వర్షాలు పడటం లేదు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 17 January 2023

హిజాబ్‌ను ధరించకపోవడం వల్లే వర్షాలు పడటం లేదు !


ఇరాన్‌ మహిళల్లో కొందరు హిజాబ్‌ను ధరించకపోవడం వల్లే దేశంలో వర్షాలు పడటం లేదని ఆ దేశ మతగురువు మహ్మద్‌ మెహదీ హుస్సేనీ హమేదాని అన్నారు. హమేదాని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు. హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇప్పటికే ఇరాన్‌ అట్టుడుకుతోంది. మరోవైపు, ఇరాన్‌లో 50 ఏళ్లలో ఎన్నడూ లేనంత కరువు ఏర్పడింది. తాగునీటికి కూడా చాలా కష్టంగా మారింది. ఈ క్రమంలో నీటి ఎద్దడికి మహిళలు హిజాబ్‌ ధరించకపోవడమే కారణం అన్న హమేదానీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. నిజానికి గత కొన్ని రోజులుగా ఇరాన్ దేశ వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనివున్నాయి. వర్షాల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు ఆందోళనలకు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి. హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇప్పటికే ఇరాన్ దేశం గత యేడాది అట్టుడికిపోయింది. హిజాబ్ సరిగా ధరించలేదన్న కారణంతో 22 యేళ్ల కుర్దిష్ యువతి మహ్సా అమినిని నైతిక విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె వారి కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయింది. అమిని మరణం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపింది. హిజాబ్ వద్దంటూ మహిళలు రోడ్డెక్కారు. హిజాబ్‌లను తీసి నడిరోడ్డుపై మంటల్లో వేసి తగలబెట్టారు. దేశమంతా పాకిన ఈ అల్లర్లతో దిగి వచ్చిన ఇరాన్ ప్రభుత్వం నైతిక విభాగం పోలీస్ ను రద్దు చేసింది.

No comments:

Post a Comment