విమానంలో యువకుల ఫైటింగ్ !

Telugu Lo Computer
0


విమానంలో కొంతమంది యువకులు కారణం ఏంటో తెలియదు కానీ తగువులాడుకున్నారు. చిన్నగా మొదలైన వీరిమధ్య గొడవ మాటామాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. విమానం గాల్లో ఉండగా.. తోటి ప్రయాణికుల ముందే రౌడీల్లా తన్నుకున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌కు చెందిన థాయ్‌ స్మైల్‌ ఎయిర్‌వేస్ విమానంలో చోటుచేసుకుంది. బ్యాంకాంక్‌ నుంచి కోల్‌కతా వస్తున్న థాయ్‌ స్మైల్‌ ఎయిర్‌వేస్‌ టేకాఫ్‌ అయ్యింది. విమానం గాల్లో ఉండగా అద్దాలు పెట్టుకున్న ఓ యువకుడు తన ఎదురుగా ఉన్న బ్లాక్‌ షర్ట్‌ వేసుకున్న వ్యక్తితో గొడవకు దిగాడు. విమానంలో ప్రయాణికులందరూ చూస్తుండగానే ఇద్దరు కొద్దిసేపు వాదులాడుతుకున్నారు. వీరిని అడ్డుకునేందుకు విమాన సిబ్బంది, సహా ప్రయాణికులు ప్రయత్నించినా గొడవ సద్దుమణగలేదు. ఇంతలో అద్దాలు పెట్టుకున్న వ్యక్తికి మద్దతుగా తన స్నేహితులు రావడంతో గొడవ ఇంకాస్తా పెద్దది అయ్యింది. దీంతో అందరూ కలిసి ఎదుటి వ్యక్తిపై చేయిచేసుకున్నారు. ఒక్కడిని చేసి అతడిపై అందరూ దాడి చేశారు. వతల వ్యక్తి ఒక్కటే కా6రకు, థాయ్ స్మైల్ ఎయిర్‌వేస్ ఈ ఘటనపై స్పందించలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)