సరదా కోసం చేసిన పని డబ్బు సంపాదించి పెట్టింది !

Telugu Lo Computer
0


అమెరికాకి చెందిన సారా, మెకాలి దంపతులు రెండు సంవత్సరాల క్రితం ఒక డిస్ట్రిబ్యూటర్ బాక్సెడ్ కలెక్షన్లను ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ద్వారా విక్రయిస్తుండటం చూశారు. వీరు కూడా అదే పనిని అవకాశంగా అందిపుచ్చుకొని రూ.16 లక్షల ఆదాయం సంపాదించారు. ఆన్‌లైన్‌ కంపెనీలకు కస్టమర్ నుంచి రిటర్న్ వెళ్లే ఓపెన్ చేయని బాక్సుల్లో ఉండే ప్రొడక్ట్లను కొనడం సులువని వీరు గమనించారు. వీటిని కొనే ఆసక్తి ఉన్నవారు దగ్గరలోని వేర్ హౌస్‌కి వెళ్లి ఒక బాక్స్‌కి దాదాపు 550 డాలర్లు చెల్లించాలి. కానీ ఆ బాక్స్‌లో ఏ ప్రోడక్టులు ఉంటాయో? వాటి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో? తెలియదు. మొదట్లో ఈ దంపతులు 25 ప్రొడక్టులు అమ్మి 1880 డాలర్‌ల ఆదాయం పొందారు. తర్వాత వారు క్రమక్రమంగా అమెజాన్ , వాల్‌మార్ట్‌లకు రిటర్న్ వచ్చే ప్రొడక్టులను వేర్‌హౌస్‌కి వెళ్లి కొని, ఈబే, ఫేస్‌బుక్‌ మార్కెట్‌ ప్లేస్‌లలో అమ్మడం మొదలుపెట్టారు. ఇలా మొత్తంగా 19,500 డాలర్‌ల ఆదాయాన్ని పొందారు. రెండు వారాల్లో వారికి పెట్టిన సొమ్ము తిరిగి వచ్చేసింది. తర్వాత 4 నుంచి 8 వారాల్లో 90 శాతం ప్రొడక్టులు అమ్ముడుపోయాయి. ఇప్పటివరకు తమకు నష్టం రాలేదని మెకాలి చెప్పారు. మనం చేసే పనిని ఉద్యోగంలా భావించి ప్రారంభిస్తే నిజంగా డబ్బు సంపాదించగలమని సారా పేర్కొన్నారు. సరదా కోసం చేసిన పని డబ్బు సంపాదించడానికి మెరుగైన మార్గంగా మారిందని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)