ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రేసులో కొత్త పేరు ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనున్నది. ఆయన రిటైర్ అవుతున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి నియమితులు కానున్నారని ప్రచారం జరుగుతున్నది. తొలుత ఓబులాపురం మైనింగ్ కేసులో క్లీన్ చిట్ లభించిన సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి పేరు సీఎస్ రేసులో వినిపించినా రీసెంట్ గా జవహర్ రెడ్డికే సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయంటూ వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ గిరిధర్ ఆర్మాణే .. శనివారం సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఆయనకు సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. కొత్త సీఎస్ కోసం కసరత్తు జరుగుతున్న క్రమంలో గిరిధర్ సీఎం జగన్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో పక్క ఆయనను రక్షణ శాఖ నుండి రిలీవ్ చేయాలని కూడా ఏపి సర్కార్ కేంద్రానికి లేఖ రాసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో గిరిధర్ సీఎస్ రేసులో ఉన్నట్లుగా చెబుతున్నారు. గిరిధర్ 1988 బ్యాచ్ కి చెందిన అధికారి. సీనియారిటీలో మాత్రం సమీర్ శర్మ తర్వాత నీరభ్ కుమార్ ప్రసాద్, గిరిధర్, పూనం మాలకొండయ్య, కరికాల వలవన్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ 1988 బ్యాచ్ కి చెందిన శ్రీలక్ష్మి, 1990 బ్యాచ్ కి చెందిన జవహర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా సీఎస్ రేసులో వినిపించాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)