మదురై హైకోర్టు ధర్మాసనంలో తొలి మహిళా చౌకీదార్‌ !

Telugu Lo Computer
0


తమిళనాడు లోని మదురై హైకోర్టు ధర్మాసనంలో మొట్టమొదటి మహిళా చౌకీదార్‌గా లలిత నియమితురాలైంది. హైకోర్టులో న్యాయమూర్తులు తమ గదుల నుంచి కోర్టు హాలుకు వెళ్లే సమయంలో వారికి ముందు చౌకీదార్‌ అనే సహాయకుడు తెల్ లయూనిఫారం, ఎరుపు రంగు తలపాగా ధరించి, చేతిలో దండంతో న్యాయమూర్తికి త్రోవ చూపిస్తూ వెళ్లడం తెలిసిన విషయమే. వీరు న్యాయమూర్తులకు అవసరమైన పుస్తకాలు, కేసుకు సంబంధించిన పైళ్లను కూడా అందిస్తారు. ఈ విధుల్లో ఇప్పటి వరకూ పురుషులే ఉండేవారు. ఇదిలా వుండగా మద్రాస్‌ హైకోర్టులో గత ఏడాది 40 మంది చౌకీదారు పోస్టుల కోసం రాత పరీక్షలు నిర్వహించగా, ఇందులో హైకోర్టు చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మహిళా చౌకీదారులను నియమించారు. మద్రాస్‌ హైకోర్టు తొలి మహిళా చౌకీదారుగా దిలానీ నియమితురాలవగా, అనంతరం మదురై ధర్మాసనంలో లలిత నియమితులయ్యారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)