కేసీఆర్ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన షర్మిలా !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్‌ను వైఎస్ షర్మిల కలసి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణలో తాజాగా జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్వేల్లో మా పార్టీకి చాలా ఆదరణ ఉందని తేలింది. అందుకే టీఆర్ఎస్ భయపడుతోంది. కావాలనే శాంతిభద్రతల సమస్యను సృష్టించారు. అందుకే మా పార్టీ కార్యకర్తలను, మా వాళ్ళని  పోలీస్ స్టేషన్లో ఇష్టానుసారం కొట్టారు. అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆగదని వాళ్లకు అర్థమైంది. అందుకే నన్ను రిమాండ్‌కు పంపాలని చూశారు. పాదయాత్రను ఆపేందుకు కుట్ర చేశారు. పాదయాత్రను ఆపే ఉద్దేశం లేకపోతే రిమాండ్ ఎందుకు అడిగారు ? ట్రాఫిక్ ఉల్లంఘన కేసులో రిమాండ్‌కు పంపుతారా ? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, కేసీఆర్ ఓ డిక్టేటర్, ఓ దొర మాదిరిగా పాలిస్తున్నారు. నర్సంపేటలో నాపై జరిగిన దాడిని గవర్నర్‌కు వివరించాను. వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రజాప్రస్థానం పాదయాత్ర సందర్భంగా చోటుచేసుకున్న దాడి, వాహనాలకు నిప్పు పెట్టడంపై ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలిపేందుకు వెళ్తుంటే చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె గవర్నర్ వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వీటిపై ఓ నివేదికను కూడా అందజేయనున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి. అనంతరం రాజ్‌భవన్ వెలుపల మీడియాతో మాట్లాడారు. దాడి జరిగిన సమయంలో ఏం జరిగిందో ఫోటోల ద్వారా వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)