మత్స్యకారుల వలకు చిక్కిన ఘోల్ చేప !

Telugu Lo Computer
0

కర్ణాటకలోని ఉడిపి తీర ప్రాంతమైన మల్పే సమీపంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు ఏకంగా రూ. 2 లక్షలు విలువ చేసే అత్యంత ఖరీదైన ఘోల్ చేప చిక్కింది. తొలుత వల భారీగా ఉండటంతో బోలెడన్ని చేపలు చిక్కాయేమో అనుకున్నాడు. తీరా వలను బయటికి లాగగానే భారీ బరువున్న ఘోల్ చేపను చూసి ఆశ్చర్యపోయాడు. 22 కిలోల బరువున్న ఈ ఘోల్ చేపను సదరు జాలరి మార్కెట్‌లో రూ.2,34,080కి విక్రయించాడు. ఈ చేపను మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఘోల్ చేపలు సముద్రపు అడుగుభాగంలో ఉంటాయి. అలాగే అరుదుగా పైకి వస్తుంటాయి. ఇవి ఎక్కువగా అరేబియా సముద్రం, శ్రీలంక, ఆస్ట్రేలియా మహాసముద్రాలలో కనిపిస్తాయి. ఘోల్ చేప పొట్టలో ఉండే ప్రత్యేక మోలిక్యుల్ సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగిస్తారు. దీనికి విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఒక మీటర్ వరకు పెరిగే ఈ చేపలు సుమారు 30 కిలోల బరువు ఉంటాయి. అలాగే మార్కెట్‌లో రూ. 5 లక్షల వరకు పలుకుతాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)