మా బాధ భారత్‌కు వరమైంది !

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి డిమెట్రో కులేబా భారత్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమ కారణంగానే రష్యా చమురును చౌకగా కొనుగోలు చేసే అవకాశం భారత్‌కి వచ్చిందని పేర్కొన్నారు. ఇది నైతికంగా భారత్‌కి తగదని, తమ బాధల వల్ల భారత్ ప్రయోజనం పొందినట్లైతే, ఆ దేశం తమకు మరింత సాయం చేయడం మంచిదని తెలిపారు. రష్యా సాగిస్తున్న దురాకమ్రణ యుద్ధంలో ఉక్రెయిన్లు ప్రతిరోజు చనిపోవడంతో పాటు మరెన్నో ఇబ్బందులు పడుతుంటే.. అదే భారత్‌కు వరమైందంటూ మండిపడ్డారు. ఇటీవలే భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఈ ఏడాదిలో ఫిబ్రవరి, నవంబర్‌ నెలల మధ్య రష్యా నుంచి సుమారు పది దేశాలకు అవసరమయ్యే శిలాజ ఇంధనాన్ని కొనుగోలు చేసేందని చెప్పారు. ఈ విషయంపైనే కులేబా స్పందిస్తూ.. భారత్‌కు చౌకగా చమురు లభించడం వెనుక బాధలు అనుభవిస్తున్న ఉక్రెయిన్లను చూడాల్సిందిగా భారత్‌ని అభ్యర్థించారు. రష్యాతో భారత్‌ వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగిస్తోందని.. యుద్ధం విషయంలో రష్యా తీరుని ఖండించింది కానీ, ఐక్యరాజ్యసమితిలో మాస్కోకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మాత్రం దూరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే.. భారత ప్రధాని మోడీ తన స్వరంతో దేన్నైనా మార్చగలరని, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగించడంలో న్యూఢిల్లీ కూడా తన వంతు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రస్తుతం సమిష్టి కృషి చేయడం ఎంతో ముఖ్యమని, భారత్ ముందుగా ప్రయత్నించకపోతే ఏది కాదని వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)