'భట్రాజు పొగడ్తలు' పదాన్ని నిషేధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 21 December 2022

'భట్రాజు పొగడ్తలు' పదాన్ని నిషేధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించింది. రాష్ట్రంలో ఎవరూ కూడా ఈ పదాన్ని పలకకూడదని ఆదేశించింది. చివరికి సినిమాలు, టీవీ సీరియళ్లలోనూ దీన్ని ఉచ్ఛరించకూడదని తెలిపింది. రాజకీయ ప్రసంగాలు, సాధారణ సభలు-సమావేశాల్లోనూ ఈ పదాన్ని పలకకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. నిషేధించిన తరువాత కూడా ఈ పదాన్ని ఎవరైనా ఉచ్ఛరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించాలనే డిమాండ్ చాలాకాలంగా వినిపిస్తూ వస్తోంది. భట్రాజు అసోసియేషన్, ఇతర బీసీ సంఘాలు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. వినతి పత్రం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భట్రాజులది పండిత కులమని, అదే గౌరవంతో చూడాల్సిన అవసరం ఉందనేది ఆయా సంఘాల ప్రతినిధులు వాదన. ఓ సినిమాలో భట్రాజు కులాన్ని యాచక వృత్తిగా వర్ణించడాన్ని తప్పు పట్టారు. తమ కులాన్ని కించపరిచేలా చూపించడం పట్ల అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నన్నయ్య భట్టారకుడు, నారాయణభట్టు, డిండిమభట్టు, కుంకుమభట్టు వంటి కవులు ఈ కోవకు చెందినవారేనని, అలాంటి కులాన్ని కించపరిచడం సరైంది కాదంటూ భట్రాజు అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని పలకడం తమ కులాన్ని కించపరిచినట్టవుతుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి డిమాండ్ పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. భట్రాజు పొగడ్తలు అనే పదాన్ని నిషేధించింది.

No comments:

Post a Comment