నవ వధువు హత్యా, ఆత్మహత్య ?

Telugu Lo Computer
0


కర్ణాటకలోని కలబుర్గి జిల్లా కమలాపుర తాలూకా కురికోటా గ్రామంలో నావదగి గ్రామానికి చెందిన డిగ్రీ 5వ సెమిస్టర్‌ చదువుతున్న సృష్టికి ఇటీలే వివాహం జరిగింది. ఇంట్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్న సృష్టి ఈనెల 13న కాలేజీకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. ఆ రోజంతా బంధువుల ఇళ్లు, చుట్టుపక్కల ప్రాంతాలు వెదికిన కుటుంబ సభ్యులు మరసటి రోజు మహాగాంవ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఇలా ఉండగా శనివారం సృష్టి మృత దేహం కురికోటా వంతెన వద్ద నదిలో లభించింది. సృష్టి ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేసారా అనే విషయం తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)