సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత

Telugu Lo Computer
0


సీనియర్ నటుడు చలపతిరావు (78) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, కుమారుడు రవిబాబు టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు ఆడ పిల్లలు అమెరికాలో ఉంటారు. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. చలపతిరావు తిరిగిరాని లోకాలకు వెళ్లారనే వార్త తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న సీనియర్ నటుడు చలపతిరావును వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు.

Post a Comment

0Comments

Post a Comment (0)