ముల్లంగి - ఆరోగ్య ప్రయోజనాలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 14 December 2022

ముల్లంగి - ఆరోగ్య ప్రయోజనాలు !


ముల్లంగి లో చాలా రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. తెలుపు, పింక్, ఎరుపు, నలుపు రకాల ముల్లంగిలో మార్కెట్లో కనిపిస్తుంటాయి. వీటిలో తెల్ల ముల్లంగి ఎక్కువగా తింటారు. సంవత్సరంలో ఏ కాలంలోనైనా దొరకుతాయి. ముల్లంగి రోజూ తగు మోతాదులో తీసుకోవడం ద్వారా లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపును కడిగేస్తుంది. అనవసరపు గ్యాస్ ను అదుపు చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ ప్రక్రియ మెరుగయ్యేలా చేస్తుంది. ఎసిడిటీ, ఒబెసిటీ, గాస్ట్రిక్ సమస్యల దరి చేరవు. అంతేకాక శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఎర్ర రక్తకణాలకు అవసరమైన ఆక్సిజన్ ను అందిస్తుంది. బ్లాక్ ముల్లంగి ఆకులను కామెర్ల చికిత్సకు వినియోగిస్తారు. గుండెకు రక్షణగా నిలుస్తుంది. దీనిని రోజూ తీసుకోవడం ద్వారా కార్డియోవాస్కులర్ వ్యాధులను తగ్గిస్తుంది. అంతేకాక దీనిలో విటమిన్ సీ, ఫోలిక్ ఆసిడ్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. దీనిని తినడం వలన శరీరానికి అవసరమైన పోటాషియం పుష్కలంగా అందుతుంది. తద్వారా అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా తోడ్పడుతుంది. ముల్లంగిలో ఉండే విటమిన్ సీ శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. సాధారణంగా సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి వాటిని అరికడుతుంది. అయితే దీనిని రోజూ ఆహారంలో భాగం చేసుకున్నప్పుడే దీని ప్రయోజనాలు పొందగల్గుతాం. రెడ్ ముల్లంగిలో అధిక సంఖ్యలో విటమిన్స్ ఈ, ఏ, సీ, బీ6, కే ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, జింక్, పోటాషియం, ఫాస్పరస్, మేగ్నీషియం, కాపర్, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తాయి. జ్యూస్ రూపంలో రోజూ తీసుకుంటే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఉండే విటమిన్ సీ, జింక్, ఫాస్పరస్ శరీరం డ్రై కాకుండా చేస్తుంది. అలాగే మొటికలు, రాషెస్ రాకుండా నియంత్రిస్తుంది. ముల్లంగి పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా కూడా వేసుకోవచ్చు. తలకు పట్టిన చుండ్రు కూడా తరిమేస్తుంది.

No comments:

Post a Comment