టెక్స్‌టైల్‌, చేనేతరంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి

Telugu Lo Computer
0


తెలంగాణలో టెక్స్ టైల్ రంగానికి ఊతమిచ్చేలా కేంద్రం అండగా నిలవాలని మంత్రి కేటీఆర్ కోరారు. నేతన్నల సంక్షేమానికి సహాకరించాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కేంద్రానికి టెక్స్‌టైల్‌, నేతన్నల పరిస్థితిపై కనీస అవగాహన లేదని విమర్శించారు. నిజంగా నేతన్నలపై ప్రేమ ఉంటే ఈ సారి బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కోరారు. నేతన్నల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తోందన్నారు. కానీ కేంద్ర బడ్జెట్‌లో కొన్నేళ్లుగా తెలంగాణకు అందుతున్నది ఏమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు, సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌కు నిధులు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. టెక్స్‌టైల్‌, చేనేతరంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)