మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు !

Telugu Lo Computer
0

హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ్‌ మెమోరియల్‌ను మంగళవారం రాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులతో పలు అంశాలపై ముచ్చటించారు. ఆ తర్వాత విద్యార్థులు లేవనెత్తిన పలు అంశాలపై స్పందించారు. పెరుగుతున్న యువ జనాభా భారత్‌కు మరింత సానుకూలమని అభిప్రాయపడ్డారు. మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అన్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని విద్యార్థులకు సూచించారు. గ్రామమైనా, ఏజెన్సీ అయినా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని పిలుపునిచ్చారు. గ్రామం, ఏజెన్సీ నుంచి వచ్చామనే ఆత్మనూన్యతను రానీయొద్దని సూచించారు. మన దేశంలో ప్రతి ఊరికి గ్రామ దేవత రక్షణగా ఉందన్న రాష్ట్రపతి, మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. మన రాజ్యాంగం మహిళలకు అనేక అవకాశాలు కల్పించిందని, తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలకు విలువల గురించి నేర్పించాలని కోరారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దని, భారత్‌లో ఉన్న జనాభా అమెరికాలో లేదన్నారు. భారత్‌లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలోని లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కేశవ్‌ మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)