కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ ప్రతిపాదన !

Telugu Lo Computer
0


దేశంలోని అన్ని రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అంతర్గత పనితీరును క్రమబద్ధీకరించి, పర్యవేక్షించే సామర్థ్యాన్ని భారత ఎన్నికల కమిషన్ కు కల్పించాలని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ  ప్రతిపాదించారు. దేశ ప్రజాస్వామిక నమూనా పనితీరులో అత్యంత తీవ్రమైన దౌర్బల్యం ఉందన్నారు. రాజకీయ పార్టీల కార్యకలాపాలు మన ప్రజాస్వామ్య సౌధానికి బలమైన పునాది వంటివని తెలిపారు. ఈ రాజకీయ పార్టీల నిర్మాణాలు, అంతర్గత పని తీరు అత్యంత గోప్యంగా ఉంటోందని, పారదర్శకత లేదని, గిడసబారిపోయిందని పేర్కొన్నారు. వీటి కార్యకలాపాలు పారదర్శకంగా, జవాబుదారీతనంతో, నియమానుసారంగా జరిగేలా చూడవలసిన అవసరం ఉందని తెలిపారు. రాజ్యాంగ సవరణ చట్టం, 2022 అని పేర్కొంటూ ప్రవేశపెట్టిన ఈ బిల్లు భారత దేశానికి అవసరమైన ప్రజాస్వామిక సంస్కరణల రెండో ప్రభంజనమని తెలిపారు. రాజకీయ పార్టీల అంతర్గత పనితీరుకు సంబంధించిన ఆదేశాలు, సూచనల అమలులో విఫలమవుతున్న సందర్భాల్లో, సంబంధిత రాజకీయ పార్టీ జాతీయ లేదా రాష్ట్ర గుర్తింపును రద్దు చేసేందుకు ఈసీఐకి అధికారం కల్పించాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. అదేవిధంగా ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్, కేటాయింపు ఆర్డర్) 1968లోని సెక్షన్ 16-ఏ ప్రకారం తగిన చర్య తీసుకోవడానికి అధికారం కల్పించాలని ప్రతిపాదించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)