మెట్రో ట్రాక్‌పై కూలిన డ్రోన్ !

Telugu Lo Computer
0


ఢిల్లీ మెట్రో రైల్ ట్రాక్ పై డ్రోన్ కూలిపోవడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రైలు పట్టాలపై డ్రోన్ కూలిపోయింది. దీంతో ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్ కొద్ది సేపు మూసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో ఇది ఫార్మా కంపెనీకి చెందిన డ్రోన్ గా తేలింది. ట్రాక్ పై కూలిన డ్రోన్ ను పరిశీలించగా అందులో మందులు దొరికాయని పోలీసులు తెలిపారు. మందులను పంపేందుకు సదరు కంపెనీ డ్రోన్లను ఉపయోగిస్తోందని తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత భద్రతా కారణాల వల్ల జసోలా విహార్ షాహీన్ బాగ్ నుంచి బొటానికల్ గార్డెన్ మధ్య మెజెంతా  లైన్ సేవలను నిలిపివేసినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ట్వీట్ చేసింది. ఈ ఘటనపై విచారణ తర్వాత మళ్లీ మెట్రో మార్గాన్ని పునరుద్ధరించారు. అయితే హై సెక్యురిటీ ఉన్న ప్రాంతాల్లో డ్రోన్ల ముప్పు పొంచి ఉందని, అధికారుల అనుమతి లేకుండా వాటిని ఉపయోగించడం చట్ట విరుద్దమని నిపుణులు చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)