అందరూ నన్ను క్షమించండి !

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన అనికేత్ కుమార్ (18)కు డాక్టర్ అవ్వాలని చిన్ననాటి నుంచి కోరిక. చదువుల్లో ఎప్పుడూ ఫస్ట్ ఉండేవాడు. నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధిస్తే, మంచి కాలేజీలో సీటు వస్తుందన్న నమ్మకంతో రాజస్థాన్, కోటాలో ఓ కోచింగ్ సెంటర్‌లో నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. ఉన్నట్టుండి శుక్రవారం ఉదయం తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో తోటి విద్యార్థులు వెళ్లి చూడగా అప్పటికే విగతజీవిగా కనిపించాడు. తన నిర్ణయానికి గల కారణాలను వివరిస్తూ రెండు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. “అందరూ నన్ను క్షమించండి. నేను మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యాను. ఒక అమ్మాయి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. నా ఎమోషన్స్‌తో ఆడుకుంది. నేను కాన్సట్రేట్ చేయలేకపోతున్నా, సరిగా చదవలేకపోతున్నా. ఆ అమ్మాయి మోసాన్ని భరించలేకపోతున్నా. అమ్మ, నాన్న, అక్క, చెల్లి నన్ను క్షమించండి..” అంటూ అనికేత్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న యువకుడి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)