ఎస్ఐ వల్లే యాక్సిడెంట్ జరిగింది ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 1 December 2022

ఎస్ఐ వల్లే యాక్సిడెంట్ జరిగింది !


ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పలుకూరు దగ్గర ఈనెల 27న రోడ్డు ప్రమాదం జరిగింది. అందరూ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌ అనుకున్నారు. కానీ గంటలు గడిచేకొద్ది నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నకందుకూరుకు చెందిన మహేష్‌ తన ఫ్రెండ్‌తో కలిసి కారులో బయలుదేరాడు. పలుకూరు దగ్గర కారు ఆపి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ క్రమంలో కందుకూరు రూరల్‌ ఎస్సై శివ నాంచారయ్య వాళ్ల దగ్గరకు వెళ్లాడు. ఫోటోలు తీసేందుకు ప్రయత్నించడంతో యువతి కంగారుపడి బోరున విలపించింది. లాభం లేదనుకున్న మహేష్‌, తన ఫ్రెండ్‌ ఇద్దరూ కారెక్కి అక్కడినుంచి వెళ్లిపోయారు. పోలీసులు వెంటాడుతున్నారన్న భయంతో కారు స్పీడ్‌ పెంచాడు మహేష్‌. ఆ సమయంలో అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. యువతి ప్రాణాలు కోల్పోగా మహేష్‌ ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ట్రీట్‌మెంట్‌ తర్వాత స్పృహలోకి వచ్చిన మహేశ్‌ జరిగిన విషయం చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కందుకూరు రూరల్‌ ఎస్సై శివ నాంచారయ్య ఓవరాక్షన్ కారణంగానే కారు వేగంగా నడిపానని, అప్పుడే యాక్సిడెంట్‌ జరిగిందని ఆస్పత్రిలో బెడ్‌పై నుంచే స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు మహేశ్‌. కారు ప్రమాదంపై సింగరాయకొండ ఎస్సై ఫిరోజ్ ఫాతిమా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఓవరాక్షన్‌ చేసింది నెల్లూరు జిల్లా పరిధిలో, కారు యాక్సిడెంట్‌కు గురైంది ప్రకాశం జిల్లా లిమిట్స్‌లోకి వస్తుండటంతో.. బాధిత బంధువులు ఇరు జిల్లాల ఎస్పీలకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులు ప్రాణాలు పోయేలా ప్రవర్తించడం దారుణమన్నారు. యువకుడి పక్కన యువతి ఉంటే ఇష్టం వచ్చినట్టు ఊహించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బాధిత కుటుంబసభ్యులు. మానవత్వం లేకుండా ప్రవర్తించిన ఎస్‌ఐ శివ నాంచారయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మహేష్‌ ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి అసలు నిజం బయటికొచ్చింది. ఒకవేళ జరగరానిది జరిగి ఉంటే..? నిజం సమాధి అయ్యేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహేశ్‌ బంధువులు.


No comments:

Post a Comment