రాజ్యసభకు నామినేట్ చేస్తానంటే రూ.50 కోట్లు ఇచ్చా !

Telugu Lo Computer
0

Sukesh Chandrashekhar: 5 Facts On Millionaire Conman

మనీలాండరింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ను మంగళవారం ఢిల్లీలోని పాటియాలా హౌస్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో ఉన్నతస్థాయి కమిటీ సుకేశ్‌ వాంగ్మూలాన్ని స్వీకరించిందని, దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉందని అతని తరపు న్యాయవాది అనంత్‌ మాలిక్‌ మీడియాకు తెలిపారు. తనను రాజ్యసభకు నామినేట్ చేస్తానని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత జైన్‌కు 2016లో అసోలాలోని తన ఫామ్‌హౌజ్‌లో రూ.50 కోట్లకు పైగా ఇచ్చానని సుకేశ్‌ తెలిపాడు. తర్వాత హయత్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో కేజ్రీవాల్ జైన్‌తో కలిసి పాల్గొన్నారని చంద్రశేఖర్ పేర్కొన్నాడు. అంతేగాక 2019లో జైలులో తన భద్రత కోసం జైన్ రూ. 10 కోట్లు వసూలు చేశాడని చంద్రశేఖర్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు రాసిన లేఖలో ఆరోపించారు.పార్టీ కోసం 20 మంది వ్యక్తులను వెతికి వారి నుంచి పార్టీ కోసం 500 కోట్ల ఫండ్‌ సమకూర్చాలని అరవింద్‌ కేజ్రీవాల్‌ డిమాండ్‌ చేసినట్లు ఆరోపించాడు. సత్యేంద్ర జైన్‌ తనను బెదిరించారని తెలిపాడు. అప్పటి జైళ్ల శాఖ డీసీ సందీప్ గోయెల్‌కు రూ.12.50 కోట్లు చెల్లించినట్లు కూడా పేర్కొన్నాడు. తాను నేరస్థుడు అని భావిస్తే.. నా నుంచి రూ.50 కోట్లు ఎందుకు స్వీకరించారని కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. అయితే చంద్రశేఖర్‌ ఆరోపణలు అబద్దమని ఆప్‌ కొట్టిపారేసింది. ఇవన్నీ బీజేపీ ఆడుతున్న నాటకాలని విమర్శించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)