నా భర్తకు ఏం జరిగినా నా తల్లిదండ్రులే బాధ్యులు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 20 December 2022

నా భర్తకు ఏం జరిగినా నా తల్లిదండ్రులే బాధ్యులు !

Illegal affair: పిల్లల తల్లితో ప్రియుడు ?, బస్ స్టాండ్ లో నరికి చంపేసిన భర్త,  భార్య జస్ట్ మిస్ ! | Illegal affair: Husband killed a man who had extra  marital affair with his wife in

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియాలో చందన్ కుమార్ అనే యువకుడు ఓ కోచింగ్ సెంటర్ ను నడిపిస్తున్నాడు. అయితే ఇతని ఇన్‌స్టిట్యూట్ కు స్థానికంగా ఉండే చాలా మంది స్టూడెంట్ హాజరయ్యే వారు. అందరిలాగే కోచింగ్ సెంటర్ కు వచ్చింది 21 ఏళ్ల అంజని కుమార్ అనే యువతి. ఆ యువతి రోజూ కోచింగ్ కు వస్తూ పోతూ ఉండేది. ఈ క్రమంలోనే టీచర్ చందన్ కుమార్ తో ప్రేమలో పడింది. ఇక ఒకరికి ఒకరు నచ్చుకోవడంతో ఇద్దరు ప్రేమించుకున్నారు. అలా కొంత కాలం పాటు వీరిద్దరి ప్రేమాయణం కొనసాగింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ యువతి తల్లిదండ్రులు మాత్రం వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఈ ప్రేమికులు పెద్దలు ఎదురించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. డిసెంబర్ 12న ఇద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంజలి కుమార్ పెళ్లి చేసుకున్న విషయం ఆ యువతి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే ఇటీవల అంజలి కుమార్ కుటుంబ సభ్యులు ఆమె భర్త చందన్ కుమార్ ను బెదిరించారట!. దీంతో వెంటనే స్పందించిన అంజలి కుమార్ ఓ వీడియోను విడుదల చేసింది. నా భర్త, అతని కుటుంబ సభ్యులను నా తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు. ఇక సహించేదే లేదు. నా భర్తకు ఏం జరిగినా చివరికి కోర్టుకు కూడా వెళ్లడానికి వెనకాడనని యువతి వీడియోలో వార్నింగ్ ఇచ్చింది. ఇదే వీడియో ఇప్పుడు కాస్త వైరల్ గా మారుతోంది.

No comments:

Post a Comment