117 స్థానాలు ఎగబాకి ఇషాన్‌ కిషన్‌ !

Telugu Lo Computer
0


బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో డబుల్‌ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఏకంగా 117 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌కు చేరుకోనున్నాడు. బంగ్లాదేశ్‌పైనే సెంచరీ చేసిన కోహ్లి రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఎనిమిదో స్థానానికి చేరాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 15వ ర్యాంక్‌కు చేరుకోగా, బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో సిరాజ్‌ 22వ స్థానంలో నిలిచాడు. ర్యాంక్‌లో టాపర్ గా పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కొనసాగుతున్నాడు.

ఐసీసీ టాప్‌-10 వన్డే ర్యాంక్స్‌ : 1.బాబర్‌ ఆజం (పాకిస్తాన్‌)-890, ఇమామ్-ఉల్-హక్ (పాకిస్తాన్‌)- 779, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (దక్షిణాఫ్రికా)-766 రేటింగ్‌, క్వింటన్‌ డికాక్‌ (దక్షిణాప్రికా)-759 రేటింగ్‌, డేవిడ్‌ వార్నర్‌ (ఆస్ట్రేలియా)-747, స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా)- 719, జానీ బెయిర్‌స్టో(ఇంగ్లండ్‌)- 710, విరాట్‌ కోహ్లి(భారత్‌)-707, రోహిత్‌ శర్మ(భారత్‌)-705, కేన్‌ విలియమ్సన్‌-700 రేటింగ్‌

Post a Comment

0Comments

Post a Comment (0)