హిందూ అనే పదానికి భారతదేశానికి సంబంధమే లేదు !

Telugu Lo Computer
0


కర్ణాటక లోని బెల్గావి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి సతీష్‌ లక్ష్మణరావ్‌ జర్కిహోలి మాట్లాడుతూ హిందూ అనే పదానికి అసభ్యమైన అర్థం ఉందని, కావాలంటే వికీపీడియాలో చెక్‌ చేసుకోవాలని సూచించారు. హిందువుల మూలాలు భారత దేశంలో లేవని, పర్షియన్‌ నుండి వచ్చాయని అన్నారు. హిందూ అనే పదం ఇరాన్‌, ఇరాక్‌, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌ ప్రాంతాల నుండి వచ్చిన పర్షియన్‌ పదమని అన్నారు. అసలు హిందూ అనే పదానికి భారత్‌కు సంబంధమే లేదని చెప్పారు. ఆ పదాన్ని భారతీయులు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చ జరగాలని సూచించారు. అయితే ఈ వ్యాఖ్యలను బిజెపి ఖండించింది. ఇది హిందువులను అవమానించడం, రెచ్చగొట్టడమేనని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)