ఎయిర్‌ షోలో అపశృతి : ఆరుగురి మృతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 12 November 2022

ఎయిర్‌ షోలో అపశృతి : ఆరుగురి మృతి

అమెరికాలోని డల్లాస్‌లో జరుగుతున్న ఎయిర్‌ షోలో అపశృతి చోటుచేసుకుంది. రెండు బాంబర్‌ విమానాలు ఒకదానినొకటి ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. రెండో ప్రపంచ యుద్ధం స్మారకంగా డల్లాస్‌ ఎగ్జిక్యూటివ్‌ విమానాశ్రయంలో ఎయిర్‌ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బోయింగ్‌ బీ-17 బాంబర్‌ విమానం గాలిలోకి ఎగిరి ప్రయాణిస్తున్నది. ఇంతలో గాల్లో చక్కర్లు కొడుతున్న బెల్‌ పీ-63 కింగ్‌కోబ్రా అనే ఫైటర్‌ విమానం వచ్చి దానిని ఢీకొట్టింది. దానితో రెండు విమానాలు కూడా క్షణాల్లోనే కుప్పకూలిపోయాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు యుద్ధవిమానాల్లో ఉన్న ఆరుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డ్‌  విచారణకు ఆదేశించాయి.

No comments:

Post a Comment