త్వరలో టీఎస్ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులు !

Telugu Lo Computer
0


టికెట్ల జారీని మరింత సరళతరం చేయనుంది ఆర్టీసీ. ప్రస్తుతం ఉన్న టికెట్ జారీ యంత్రాలు (టిమ్స్) స్థానంలో ఇంటెలిజెంట్ టికెట్ జారీ యంత్రాలు (ఐటిమ్స్) తీసుకురానున్నారు. ఈ యంత్రాల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులు, యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించి.. టికెట్లు తీసుకోచ్చు. బస్ పాస్‌ల విషయంలోనూ స్మార్ట్ టెక్నాలజీని వినియోగించుకోనుంది. పాస్‌ల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. మొబైల్ యాప్‌లోనే పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాస్‌లను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయడంతో పాటు యాప్‌ ద్వారానే రీచార్జి చేసుకోవచ్చు. ప్రస్తుతం మెట్రో రైళ్లలో ఉన్నట్లుగానే ఆర్టీసీలోనూ స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టబోతోంది. బస్సుల్లో వెళ్లినప్పుడల్లా టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా..ఈ స్టార్ట్ కార్డులను తీసుకొస్తున్నారు. కార్డులో ఉన్న మొత్తం నుంచే చార్జి డబ్బును తీసుకొని.. టికెట్ల ఇస్తారు. క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని రెండు దశల్లో రాష్ట్రమంతటా అమలు చేయాలని టీఎస్ఆర్టీసీ భావిస్తోంది. తొలి దశలో హైదరాబాద్ జోన్ పరిధిలో 3,087 సర్వీసుల్లో 3,500 ఐటిమ్స్ యంత్రాలను వినియోగిస్తారు. అక్కడ విజయవంతమైతే.. మిగతా చోట్లా తీసుకొస్తారు. ఆర్టీసీలో సొంత, అద్దె బస్సులు కలిపి.. మొత్తం 9,321 ఉన్నాయి. ఇందుకు 10వేల ఐటిమ్స్ యంత్రాలు అసరమవుతాయి. ఈ ఐటిమ్స్ యంత్రాలతో పాటు స్మార్ట్ కార్డులు, మొబైల్ యాప్ టెక్నాలజీ కోసం తెలంగాణ ఆర్టీసీ ఇప్పటికే టెండర్లను ఆహ్వానిస్తోంది. స్మార్ట్ టెక్నాలజీ కోసం వచ్చే నెల 2వ తేదీ లోపు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే రోజు టెక్నాలజీని పరిశీలిస్తారు. అనంతరం గుత్తేదారులను ఎంపిక చేస్తారు. టెండర్లు దాఖలు చేసే కాంట్రాక్టర్ల అనుమాల నివృత్తి కోసం నవంబరు 16న ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది ఆర్టీసీని పూర్తిగా స్మార్ట్‌గా మార్చాలని భావిస్తున్నారు. 2023 మార్చి లోపు ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపులను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)