సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే కొనుగోలు నిందితులు !

Telugu Lo Computer
0


తెలంగాణాలో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనటానికి కుట్ర చేశారని, కోట్ల రూపాయలు నగదు ఆశ చూపించటానికి కుట్ర పన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్టును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ అరెస్ట్ చెల్లదని..ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఈకేసులో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలు. ఈ పిటీషన్ ను శుక్రవారం లిస్ట్ చేయాలని సీజేఐ ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం జరిగిందనే వార్తలతో తీవ్ర సంచలనం రేపింది. ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీగా నగదు ఆశచూపారనే కారణంతో రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీలను అరెస్ట్ చేశారు. వీరు ప్రస్తుతం జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, నంద కుమార్, సింహయాజీలు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే యత్నం చేసిన కేసులో తమ అరెస్టును సవాలు చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)