సీసీ కెమెరాల నిఘా ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలో రెండో స్థానంలో హైదరాబాద్ !

Telugu Lo Computer
0


ప్రపంచవ్యాప్తంగా సీసీ కెమెరాల నిఘా ఎక్కువ ఉన్న నగరాల జాబితా వెల్లడైంది. టాప్ 10 నగరాల్లో భారతీయ నగరాలే ఎక్కువ ఉండడం విశేషం. భారత్ నుంచి ఇండోర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. ఢిల్లీ చెన్నై నగరాలు కూడా ప్రపంచంలోనే అత్యంత పనితీరు కనబరిచాయి. ప్రపంచంలోనే అత్యంత సెక్యూరిటీ ఉంది చైనాలోని బీజింగ్ నగరం. ఇక్కడ ప్రతీ 1000 మందికి 372.8 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 62.52 కెమెరాలతో రెండో స్థానంలో ఉంది. ఇక ప్రపంచంలోనే మూడో స్థానం హైదరాబాద్ కు దక్కింది. ఇక్కడ ప్రతీ 1000 మందికి 41.80 కెమెరాలున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ 26.7 శాతంతో నాలుగో స్థానంలో.. చెన్నై 24.53 స్థానంతో 5వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో లండన్, బ్యాంకాక్, న్యూయార్క్, ఇస్తాంబుల్, పారిస్, బెర్లిన్ నగరాలు ఉన్నాయి.ఇవన్నీ కూడా మన భారతీయ నగరాల తర్వాతే ఉండడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)