ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలింపు

Telugu Lo Computer
0


తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. వారిని నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. వారికి వాయిస్ పరిశీలన పరీక్షలు నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల బేరసారాల్లో బయటపడ్డ ఆడియో, వీడియోలలోని వాయిస్‌తో పోల్చి చూడనున్నారు. వాయిస్ రికార్డ్ తీసుకున్న అనంతరం రాజేంద్రనగర్ కు నిందితులను తీసుకెళ్లనున్నారు.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎఫ్ఎస్ఎల్ నివేదిక కీలకం కానుంది. రెండు రోజలు సిట్ విచారణలో భాగంగా మొదటిరోజు (గురువారం) నిందితుల నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టారు. రాజేందర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు వేర్వేరు గదుల్లో ఉంచి విచారణ చేపట్టారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు రామచంద్రభారతి, సింహయాజి, నందకుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. వీడియో, ఆడియో టేపులతో పాటు కాల్ డేటా, వాట్సప్ చాటింగ్‌ల పై నిందితులను ఆరా తీసారు. ఈ విచారణలో కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)