ఒకే ఒక్క 'ఓటరు' ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 5 November 2022

ఒకే ఒక్క 'ఓటరు' !


గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌లో ఈ ప్రత్యేక పోలింగ్‌ కేంద్రం ప్రత్యేకత కలిగి ఉన్న నియోజకవర్గం 'ఉనా'. ఆ ఒకే ఒక్క ఓటరు పేరు ''మహంత్‌ హరిదాస్‌ బాపు'. బనేజ్‌ ప్రాంతానికి చెందిన బాపు తన ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఎన్నికల్లోనూ ఆ పోలింగ్‌ కేంద్రానికి వచ్చేవారు. ఆ ప్రాంత శివాలయం వద్ద నివసించేది ఆయన ఒక్కరే కావడంతో తన కోసమని ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసేది. కానీ 2019లో మహంత్‌ హరిదాస్‌ మరణించారు. ఆయన మరణం తరువాత ఆ పోలింగ్‌ బూత్‌ను మూసివేయాలనుకున్నారు. కానీ ఈ ప్రత్యేక పోలింగ్ బూత్ ను ఏర్పాటును ఈసీ కొనసాగిస్తోంది. ఎందుకంటే మహంత్ హరిదాస్ బాపు మరణించిన ఆయన వారసుడిగా మహంత్‌ హరిదాస్‌ మహరాజ్‌ రావడంతో తిరిగి ఆ పోలింగ్‌ బూత్‌ను కొనసాగిస్తున్నారు. త్వరలో జరుగనున్న గుజరాత్‌ శాసనసభ ఎన్నికలకు ఈ పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా వార్తల్లో నిలుస్తోంది. కాగా ఈసీ ఈ పోలింగ్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయకపోతే ఆ ఒక్క ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ 100 కిలోమీటర్ల కంటే ఎక్కవు దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment