పాక్ ఓటమితో విద్యార్ధుల మధ్య ఘర్షణ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 13 November 2022

పాక్ ఓటమితో విద్యార్ధుల మధ్య ఘర్షణ !


పంజాబ్ లోని ఘల్లకలన్‌లో లాలా లజపతిరాయ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌లోని ఫార్మసీ కళాశాల హాస్టల్‌ విద్యార్థులు అందరూ కలిసి నిన్న టీ20 క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన వెంటనే హాస్టల్‌లో నివసిస్తున్న బీహార్, జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు పలు నినాదాలు చేశారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడింది. పరస్పరం దుర్భాషలాడుతూ, కొట్టుకుంటూ, రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనపై స్థానిక ఎస్‌హెచ్‌ఓ జస్వీందర్ సింగ్ వార్తా సంస్థ 'ఏఎన్ఐ'తో మాట్లాడుతూ తాము హాస్టల్ ప్రాంగణానికి చేరుకున్నప్పుడు విద్యార్థులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం కనిపించిందని తెలిపారు. అయితే అక్కడ విద్యార్థులు ఎలాంటి నినాదాలూ చేసినట్టు తమకు వినబడలేదని చెప్పారు. ఈ ఘర్షణపై జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆ జిల్లా ఎస్ఎస్పీతో మాట్లాడింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ విద్యార్థులు మాట్లాడుతూ తాము భారత్‌కు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదని, పాకిస్తాన్ ఓడిపోయిన వెంటనే బీహార్ విద్యార్థులు ఇస్లాం గురించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దానిని ఆపాలని కోరినప్పుడు తమపై దాడి చేశారని పేర్కొన్నారని 'జాగరణ్' తెలిపింది.

No comments:

Post a Comment