రెండు కోట్ల విలువైన మద్యం సీసాలను ధ్వంసం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కోట్లు విలువైన మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు.  కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గంపలగూడెం, విస్సన్నపేట, జి.కొండూరు, తిరువూరు, ఏ కొండూరు మండలాల పరిధిలో గత కొంతకాలంగా పక్క రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యం సుమారు రెండు కోట్ల రూపాయలు పైగా విలువ గలిగిన మద్యాన్ని, 82,955 మద్యం బాటిల్స్ ధ్వంసం చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ.. రెండు కోట్ల రూపాయలు విలువ కలిగిన ఈవిధ బ్రాండ్ల మద్యం బాటిల్స్ ధ్వంసం చేయడం జరిగిందన్నారు. ఏపీ ఎక్స్చేంజ్ యాక్ట్ కింద అక్రమ మద్యం బాటిల్స్ ధ్వంసం చేశామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం తిరువూరు విసన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నాటుసార తయారీదారులపై నాలుగు పిడి యాక్ట్లు పెట్టడం జరిగిందని ఆమె తెలిపారు. అక్రమంగా పక్క రాష్ట్రం నుంచి ఎవరో మద్యం రవాణా చేయకూడదని చేసిన వారికి కఠిన శిక్షలు జరుగుతాయని ఆమె హెచ్చరంచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీసు కమిషనర్ మేరీ ప్రశాంతి ఏసీబీ ఏ ఎన్ సి పి శ్రీ మోకా సత్తిబాబు, పీ నారాయణస్వామి, ఏసిపి కెవి ఎన్వి ప్రసాదు, తిరువూరు,మైలవరం, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్, ఏసిపి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు .

Post a Comment

0Comments

Post a Comment (0)