మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవండి ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 26 November 2022

మళ్ళీ ఉద్యమానికి సిద్ధమవండి !


రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా మరోసారి త్వరలో రైతు ఉద్యమాన్ని తీవ్రతతరం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. భారీ స్థాయిలో మరోసారి జరిగే రైతు ఆందోళనకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు తమ ట్రాక్టర్లు, ట్విట్టర్ ఖాతాలతో సిద్ధం కావాలని ఆయన అన్నారు. "త్వరలో ఒక భారీ ఉద్యమం ప్రారంభమవుతుంది. రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలో మనం చూపుదాం" అని తికాయత్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లో కిసాన్ పంచాయతీలను నిర్వహిస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలు రద్దై, రైతుల ఆందోళన విరమించుకున్న యేడాది తర్వాత ఉత్తరప్రదేశ్‌లో బికెయు కిసాన్ పంచాయతీలను నిర్వహించడం ద్వారా రైతులను మళ్లీ చైతన్యవంతం చేయడం ప్రారంభించింది. ఉత్త్తరప్రదేశ్ లోని లక్నోలోని ఎకో గార్డెన్‌లో 15,000 మందికి పైగా రైతులను ఉద్దేశించి రాకేశ్ తికాయత్ ప్రసంగిస్తూ  రాబోయే రోజుల్లో దేశంలో వ్యవసాయ ఉద్యమం తీవ్రమవుతుంది. ఉద్యమమంటే రైతుల శక్తి, దాని ద్వారానే వారి సమస్యలు పరిష్కారం అవుతాయి. రైతులు, రైతు కూలీలు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు తప్ప ప్రతిపక్షాలు కాదు అన్నారు. ప్రతిపక్ష పార్టీలను ఎగతాళి చేస్తూ, వారంతా 2024 నాటికి బిజెపిలో విలీనం అవుతారని, రైతులు మాత్రమే పోరాడగలరని అన్నారు. ప్రభుత్వం నియంతలా వ్యవహరించడం తప్ప రైతుల కోసం చేసిందమీ లేదని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం విపక్ష గళాలను అణచివేస్తోందని అందుకే వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నారన్నారు. మాయావతి హయాంలో రైతుల సంక్షేమంకోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు. ఉచిత కరెంటు గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతున్నాయని ఆరోపించారు. గ్రామాల్లో మీటర్లు బిగిస్తున్నారని, అంటే రైతులు పై భారం పడుతుందని, రైతులు బిల్లులు చెల్లించాల్సివస్తిందన్నారు. కనీస మద్దతుధర గురించి మాట్లాడుతూ 2005లో బిహార్ లో మండి వ్యవస్థను నాశనం చేశారు. ఇప్పుడక్క డ రైతులు క్వింటాలు రూ.800కే ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. హిమాచల్ లో కూడా ధాన్యాన్ని ఆదానీలకు అమ్ముకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారన్నారు. డిసెంబర్ 8 న, భవిష్యత్ కార్యక్రమాన్ని రూపందించేందుకు ఇతర రైతు సంఘాలు, సంస్థలతో సమావేశాన్ని నిర్వహిస్తామని రైతు నాయకుడు, ఎంపీ హన్నన్ మొల్లాచెప్పారు. గత ఏడాది రైతు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని రైతు నాయకులు డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment