యువరాజ్‌కు నోటీసులు ఇచ్చిన గోవా

Telugu Lo Computer
0


మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు గోవా పర్యాటక శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లాకు రిజిస్ట్రేషన్ చేయకుండానే వాడుకుంటున్నట్లు యువీపై ఫిర్యాదు నమోదు అయ్యింది. అయితే ఈ కేసులో డిసెంబర్ 8వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది. హోమ్‌స్టేగా వాడుతున్న విల్లాకు గోవా పర్యాటక శాఖ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కాసా సింగ్ అని ఆ విల్లాకు యువీ పేరు పెట్టుకున్నాడు. నార్త్ గోవాలో ఉన్న ఆ విల్లాకు నవంబర్ 18వ తేదీన నోటీసులు ఇచ్చారు. ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకోలేదు కాబట్టి, లక్షరూపాయలు జరిమానా కట్టాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎయిర్‌బీఎన్బీ లాంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్‌లో యువీ తన విల్లాను హోమ్‌స్టేగా చూపిస్తున్నాడని, అలాంటప్పుడు ఆ బిల్డింగ్‌ను ఎందుకు రిజిస్టర్ చేసుకోవడం లేదని గోవా పర్యాటక శాఖ ప్రశ్నించింది. డిసెంబర్ 8వ తేదీ లోపు యువీ వివరణ ఇవ్వకుంటే, అప్పుడు జరిమానా విధిస్తామని గోవా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)