చిన్నారిని ఆదుకున్న అదానీ !

Telugu Lo Computer
0


ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన నాలుగేళ్ల మనుశ్రీ కి గుండెలో చిన్న రంధ్రం ఏర్పడింది. ప్రస్తుతం ఆ చిన్నారి లఖ్‌నవూలోని ఓ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. ఆ పాప చికిత్స కు రూ.1.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. అయితే మనుశ్రీ తల్లిదండ్రులకు అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేక బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే అషుతోష్ త్రిపాఠి అనే వ్యక్తి మనుశ్రీని ఆదుకోవాలని ఒక యూపీఐ కోడ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానిని చుసిన గౌతమ్ వెంటనే ఆయన స్పందించారు. నాలుగేళ్ల చిన్నారి మనుశ్రీ పరిస్థితి తనను కదిలించిందని.. ఆ పాప పూర్తిగా కోలుకునే వరకు తల్లిదండ్రులతో టచ్ లో ఉండాలని అదాని ఫౌండేషన్ ను ఆదేశించారు. అషుతోష్ త్రిపాఠి ట్విట్ ట్యాగ్ చేస్తూ చిన్నారి తిరిగి తన స్నేహితులతో సంతోషంగా ఆడుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. అదాని చాటుకున్న మానవత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)