ఇటలీ దేశస్తుల సందడి !

Telugu Lo Computer
0


తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం బంగాళాఖాతం తీరంలో పల్లవ రాజుల శిల్పకళా నైపుణ్యంతో నిర్మించిన వారసత్వ భవనాలను ఇటలీ దేశానికి చెందిన 300 మంది ఆసక్తిగా వీక్షించారు. ప్రపంచంలో కరోనా మహమ్మారి ప్రభావం వల్ల అధిక మరణాలు ఎదుర్కొని మళ్లీ సహజ స్థితికి చేరుకున్న ఇటలీ దేశానికి చెందిన పర్యాటకులు రెండేళ్ల అనంతరం శుక్రవారం మహాబలిపురం అందాలు వీక్షించేందుకు తరలివచ్చారు. ఇక్కడ యునెస్కో గుర్తింపు పొందిన సముద్రతీర ఆలయం, అర్జున తపస్సు, పంచ పాండవుల రథం, శివా, విష్ణు సన్నిధులు, వెన్నముద్ద రాయి, పురాతన లైట్‌ హౌస్‌ తదితర వారసత్వ భవనాల వద్ద సందడి చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)