మనుమరాలితో కలిసి స్టెపులేసిన రఘువీరా ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 November 2022

మనుమరాలితో కలిసి స్టెపులేసిన రఘువీరా !


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొంత కాలం పీసీసీ అధ్యక్షుడిగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత నెలకొన్న పరిణామాలతో రాజకీయాలకు స్వస్తిచెప్పారు. ప్రస్తుతం ఆయన ఎక్కువగా కుటుంబంతో గడుపుతున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా జీవిస్తున్నారు. తన మనవరాలితో కలిసి స్టెప్పులేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టీవీలో వస్తున్న ఓ పాటకు ఆయన డ్యాన్స్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆయనపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లీడర్ అంటే మీలా ఉండాలి అని కామెంట్స్ పెడుతున్నారు. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జీవించడంలో మీకు మీరే సాటి అని ప్రశంసిస్తున్నారు. ఈ వయసులోనూ ఇంత చలాకీగా ఉండడం ఆయనకే చెల్లిందంటున్నారు. కాగా, క్రియాశీల రాజకీయాలకు రఘువీరా దూరమైన తర్వాత సోషల్ మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పెట్టిన ఓ పోస్టు కూడా వైరల్ అయింది. ఓ బావిని చూపిస్తూ తాను చిన్నప్పుడు ఇదే బావిలో ఈత నేర్చుకున్నానని, ఇప్పుడు ఇదే బావిలో తన మనవరాలికి ఈత నేర్పిస్తున్నట్టు ఆ పోస్టులో పేర్కొన్నారు. సాధారణ ఓటర్‌గా క్యూ లైన్‌లో నిల్చొని ఎన్నికల్లో ఓటేసిన సమయంలో ఆయనకు అందరి నుంచి మంచి మన్ననలు అందాయి.

No comments:

Post a Comment