ప్రతి స్త్రీ ఒక వజ్రం !

Telugu Lo Computer
0


ప్రతి మహిళ ఒక వజ్రం పేరుతో తనిష్క్ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఈ క్యాంపెయిన్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రాంతీయ సెలబ్రిటీలను రంగంలోకి దించింది. టాటా గ్రూప్ జ్యువెలరీ రిటైలర్ తదుపరి దశ కోసం "ఎవ్రీ ఉమెన్ ఎ డైమండ్" ప్రచారంలో ఈ ప్రాంతం నుండి స్ఫూర్తిదాయకమైన మహిళలను ఎంపిక చేసింది. ఈ కొత్త ప్రచారంతో స్థానిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ కొత్త క్యాంపెయిన్ ద్వారా ప్రతి మహిళ తన దైనందిత జీవిత ప్రయాణంలో అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలదనే థీమ్‌ను విస్తృతంగా ప్రచారం చేస్తూ మహిళలను ప్రోత్సహిస్తోంది. నేటి మహిళలు తాము సాధించిన విజయాలను వేడుకగా ఎలా జరుపుకుంటున్నారనే దానిపై జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ ఒక అద్బుతమైన కథనం ద్వారా తెలియజేస్తోంది.అంతేకాదు ప్రతి మహిళ తనను తాను తీర్చి దిద్దుకోవడాన్ని వజ్రంతో పోల్చుతూ వారు ఎందులోనూ తక్కువ కాదని చెబుతోంది. హనానే బెన్‌ఖాలౌక్ అనే న్యాయవాదిని యూఏఈలో ఎంతో గౌరవిస్తారు. ఇందుకు కారణం లింగ సమతుల్యతపై ఆమె చేసిన పోరాటమే. ఎప్పటికప్పుడు వేగంగా మారుతున్న ప్రపంచంలో సంబంధాలు ఎలా ఉన్నాయనే దానిపై "సీడ్స్ ఆఫ్ ఛేంజ్" అనే పుస్తకంలో రాశారు.మహిళలు స్వేచ్ఛగా ఎగిరేందుకు రెక్కలు అవసరమని బలంగా విశ్వసిస్తున్నట్లు హనానే పేర్కొన్నారు. జీనా అక్కావీ ఒక పబ్లిసిస్ట్, స్పీకర్ మరియు మెంటార్. నేటి ప్రపంచంలో ఉన్న అవకాశాలపై మాట్లాడుతూ ప్రసంగిస్తూ నిత్యం బిజీగా ఉంటుంది.యూఏఈలో తనిష్క్ నిర్వహించిన క్యాంపెయిన్‌లో భారత్‌కు చెందిన స్థానిక విద్యావేత్త నర్గీస్ ఖంబట్టా, లైఫ్ కోచ్ మేఘనా ముండ్కూర్‌లు పాల్గొన్నారు.ప్రస్తుతం యూఏఈలో డిటిటల్, ప్రింట్, ఔట్‌డోర్ మాధ్యమం ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. "వారి జాతి, నేపథ్యం లేదా వృత్తితో సంబంధం లేకుండా, ప్రతి మహిళ వజ్రంలా ఇతర మహిళలందరికీ ఎలా స్ఫూర్తినిస్తుంది, మహిళలందరూ ఎలా ప్రత్యేకమైనవారు అదే సమయంలో ఈ వేడుకను ఎలా జరుపుకోవాలన్నవాస్తవాన్ని నొక్కి చెబుతోంది" అని టైటాన్ కంపెనీ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డివిజన్ వందన భల్లా అన్నారు. ఇప్పటికే సున్నితమైన కొన్ని అభరణాలతో వారి అద్భుతమైన కథనాలకు మెరుపును జోడించే ప్రయత్నం చేస్తున్నట్లు తనిష్క్ పేర్కొంది. 4 స్పూర్తిదాయకమైన వ్యక్తులు ధరించే ఆభరణాలు ఇప్పుడు యూఏఈ లోని తనిష్క్ అవుట్‌లెట్‌లలో ,స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి .అంతేకాదు సున్నితమైన డైమండ్ నెక్‌వేర్ సెట్‌లు, ఉంగరాలు, చెవిపోగులు, బ్రాస్‌లెట్‌లు, బ్యాంగిల్స్‌తో పాటు మరిన్ని ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)