వ్యాక్సిన్‌ మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించం !

Telugu Lo Computer
0


కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ నిర్వహణ వల్ల సంభవించే మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించదని, పరిహారం చెల్లించే బాధ్యత ప్రభుత్వానికి లేదని  కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ దుష్ప్రభావాల కారణంగా మరణించిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్‌ ప్రోగ్రామ్‌ కింద వాడుకలో ఉన్న వ్యాక్సిన్లు మూడు సంస్థలు తయారు చేశాయని తెలిపింది. టీకాల వాడకం ప్రతికూల ప్రభావాల కారణంగా సంభవించే అత్యంత అరుదైన మరణాల కోసం పరిహారం అందించడానికి ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడం చట్టబద్ధంగా నిలవదని పేర్కొంది. వ్యాక్సిన్‌ లబ్ధిదారులు టీకా గురించి మరింత సమాచారం టీకా సైట్‌లో లేదా ఆరోగ్య కార్యకర్తలు, వైద్యుల నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)