బ్రోకర్లను పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు

Telugu Lo Computer
0


నిన్నటి సినిమా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది. రోహిత్ రెడ్డితో ప్రభుత్వం కూలిపోతుందంటే మేము చేసేదేమి లేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ కు విశ్వాసం లేదు. రోహిత్ రెడ్డి  పెద్ద నీతిమంతుడా? నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ నుంచి వచ్చారు. పాత రికార్డునే తిరగరాశారు. మధ్యలో బ్రోకర్లను పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎమ్మెల్యేలను చేర్చుకోడానికి ఆ మాత్రం శక్తి మాకు లేదా, స్వామీజీలు అవసరమా? గతంలో చేరిన వారు ఎలా వచ్చారు. బ్రోకర్లను మధ్యలో పెట్టి చేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నెలలో 15 రోజులు ఫామ్ హౌజ్ లో వుండే నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. సామాన్య ప్రజలను మీరు ఎపుడైనా కలిశారా? ఫామ్ హౌజ్ లో ఆర్టిస్టులు కూర్చొని అందమైన అబద్దాన్ని వీడియోలో చూపించారు. కేసీఆర్ చూపిన వీడియోలో ఏముందో అర్ధం కాలేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో తమ పార్టీలో చేరిన వారు స్వామీజీల మధ్యవర్తిత్వం ద్వారా చేరారా అని కిషన్ రెడ్డి  ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల వరకు మేము ఆగుతామని చెప్పారు. తమకు ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుతో ఆ సంఖ్య నాలుగుకు చేరుకుంటుందన్నారు . ఫామ్ హౌజ్ ఘటనపై తాము సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్ చేస్తే దానికి కేసీఆర్ సర్కార్ సిద్ధంగా లేదన్నారు. అలాగే ఫామ్ హౌజ్ ప్రలోభాలకు సంబంధించిన వీడియోలను సిజేలకు పంపుతామని చెప్పడం సరికాదన్నారు. గతంలో టీడీపీ , కాంగ్రెస్  నుండి టిఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు చేరారు. కానీ వారిలో ఎవరైనా రాజీనామా చేసి పార్టీలో చేరారా అని ప్రశ్నించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)