అయ్యన్నపాత్రుడికి హైకోర్టు నోటీసులు

Telugu Lo Computer
0


టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు రాజేష్ రిమాండ్‌ను తిరస్కరిస్తూ విశాఖ చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును ఏపీ సీఐడీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనితో పాటు  అయ్యన్న పాత్రుడు వేసిన పిటిషన్‌పై కూడా విచారణ జరిపింది. ఈ సందర్భంగా సెక్షన్ 467 వర్తించదని ఎలా చెబుతారని విశాఖ కోర్టును హైకోర్టు ప్రశ్నించింది. అయ్యన్నపాత్రుడు, రాజేష్‌లకు నోటీసులు జారీచేసిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10వ తేదీకి వాయిదా వేసింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తన ఇంటి వెనుక ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి కబ్జా చేశారని ఆరోపిస్తూ సీఐడీ అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేష్‌ను గురువారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. ఈ మేరకు వీరిద్దరినీ విశాఖ సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే విచారణ జరిపిన కోర్టు వీరి రిమాండ్‌ను తిరస్కరించింది. అదే సమయంలో బెయిల్ కూడా ఇచ్చి విడుదల చేసింది. దీంతో సీఐడీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)