కెనడాకు తొలిసారి డేవిస్‌కప్‌ టైటిల్‌

Telugu Lo Computer
0


ప్రపంచ పురుషుల టీమ్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌ డేవిస్‌కప్‌లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్‌లో జరిగిన ఫైనల్లో కెనడా 2-0తో ఆస్ట్రేలియాపై గెలిచింది. తొలి సింగిల్స్‌లో షపోవలోవ్‌ 6-2, 6-4తో కొకినాకిస్‌పై నెగ్గాడు. రెండో సింగిల్స్‌లో ఫెలిక్స్‌ అలియాసిమ్‌ 6-3, 6-4తో అలెక్స్‌ డిమినార్‌ను ఓడించి 122 ఏళ్ల డేవిస్‌కప్‌ చరిత్రలో కెనడాకు తొలిసారి టైటిల్‌ అందించాడు. 2019లో కెనడా ఫైనల్‌కు చేరినా రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)