45 రోజుల్లో రూ.3కోట్ల విలువైన పారాసిటమాల్ మాత్రలు వాడకం ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 14 November 2022

45 రోజుల్లో రూ.3కోట్ల విలువైన పారాసిటమాల్ మాత్రలు వాడకం !


వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఓ జిల్లాలో ప్రతి ఇంట్లోని నలుగురు వ్యక్తుల్లో ఒకరు జ్వరపీడితులే. దీంతో పారాసిటమాల్ మాత్రల విక్రయాలు భారీగా పెరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాద్ జిల్లాలో  నెలన్నర వ్యవధిలో రూ.3 కోట్ల విలువైన పారాసిటమాల్ మాత్రల విక్రయాలు జరిగాయి. జిల్లా ఆసుపత్రులు మొదలు కొని ప్రైవేట్ మెడికల్ స్టోర్ల వరకు పారాసిటమాల్ మాత్రకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఇటీవల వైరల్ ఫీవర్స్ భారీగా పెరిగాయని, అదే సందర్భంలో ఫీవర్స్‌లో మార్పులున్నాయని వైద్యులు పేర్కొన్నారు. జ్వరం ప్రభావం చాలా రోజుల పాటు ఉంటుందని చెబుతున్నారు. అలాగే జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా మందుల వినియోగం భారీగా పెరిగింది. నవంబర్ మాసంలో ఇదే జోరు కొనసాగే అవకాశం ఉందని మెడికల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. పారాసిటమాల్ దాదాపు పది బ్రాండెడ్, 15 జెనరిక్ ఔషధాల రూపంలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో డోలోకు ఎక్కువ డిమాండ్ ఉంది. వీటితో పాటు కాల్పోల్, ఎసిక్లోపెనాక్, పారాసిటమాల్‌తో కూడిన డిక్లోపినెక్, పారాసిటమాల్ – నిమోస్లయిడ్, పారాసిటమాల్ -ఇబుబ్రూపెన్ టాబ్లెట్స్‌ను జనం పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ జిల్లా పరిధిలో నెలరోజుల్లో రూ.3కోట్లకుపైగా వ్యాపారం జరుగడంతో పాటు ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు సాగుతున్నాయి. అలాగే అజిత్రోమైసిన్ టాబ్లెట్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. డెంగ్యూ కారణంగా ప్లేట్లెట్స్ తగ్గడంతో కోరిపిల్, విట్ గో అమ్మకాలు పెరిగాయి. జిల్లా ఆస్పత్రిలోని ఓపీడీకి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో జ్వరపీడితులు వస్తున్నారని ఫార్మసిస్ట్ కౌన్సిల్ అధ్యక్షుడు సందీప్ బడోలా పేర్కొన్నారు. జిల్లా దవాఖానాలో రోజూ మూడు నుంచి నాలుగు వేల పారాసిటమాల్ వినియోగం జరుగుతుందని పేర్కొన్నారు. గత ఒకటిన్నర నెలల్లో పారాసిటమాల్ డిమాండ్ వేగంగా పెరిగిందని, అమ్మకాలు 20 నుంచి 25 శాతం పెరిగాయని డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సాహితీ రస్తోగి తెలిపారు.

No comments:

Post a Comment