ఉత్తరాఖండ్ లో 36 వంతెనలు రాకపోకలకు సరిపోవు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ లో 36 వంతెనలు రాకపోకలకు సరిపోవని తేల్చారు. వాటన్నింటికీ తాళం వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ప్రత్యామ్నాయాలను వెంటనే సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 30న మోర్బీ దుర్ఘటన జరిగిన తర్వాత, ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. నవంబర్-3న రాష్ట్రంలోని బ్రిడ్జ్ ల పరిస్థితిపై ఆడిట్ నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. సీఎం ఆదేశాలతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించింది. రాష్ట్రంలోని 3,262 బ్రిడ్జిలకు గాను 2,618 వంతెనలపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించారు. అందులో 36వంతెనలు రాకపోకలకు అనర్హమైనవి అని నిర్ధారించారు. వీటికి వెంటనే తాళాలు వేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికిప్పుడు బ్రిడ్జిలకు తాళం వేస్తే రాకపోకలకు ప్రత్యామ్నాయం ఏంటి అని ప్రశ్న తలెత్తుతోంది. ప్రాణాపాయం అని తెలిసినా వాటిపై వాహనాలను అనుమతిస్తే అది మరింత ప్రమాదం అనే అనుమానం కూడా వెంటాడుతోంది. దీంతో ప్రత్యామ్నాయం లేనిచోట్ల భారీ వాహనాలను బ్రిడ్జిలపైకి వెళ్లకుండా నిషేధించారు. వీలైనంత త్వరగా కొత్త వంతెనల నిర్మాణాలను ప్రారంభించబోతున్నారు. కొత్త వంతెనలు సకాలంలో నిర్మించేందుకు వీలుగా బ్రిడ్జి బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. బ్రిడ్జ్ బ్యాంక్ లకు నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. అవసరమైన చోట వాటిని వినియోగించుకునే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. గుజరాత్ ఘోరం ఉత్తరాఖండ్ లో పునరావృతం కానీయొద్దని అధికారులకు ఆదేశాలిచ్చింది ప్రభుత్వం.

Post a Comment

0Comments

Post a Comment (0)