305 కోట్లు వసూలు చేసిన కాంతార - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 2 November 2022

305 కోట్లు వసూలు చేసిన కాంతార


కన్నడలో రూపొందిన ఈ కాంతార  కర్ణాటకలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి వారం రోజుల్లో మరో మూడు భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. దీంతో విడుదలైన అన్ని భాషల్లోనూ కానక వర్షం కురిపించింది. ఇంతవరకూ ఈ సినిమా 305 కోట్లను వసూలు చేసినట్లు ఈ సినిమా టీమ్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. తెలుగులో డబ్ చేసిన ‘కాంతార’ పెను సంచలనాలను సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం కేవలం 18 రోజుల్లోనే భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 2.30 కోట్లుగా నమోదైంది. ఇక, 18 రోజుల్లో ఈ చిత్రానికి భారీ స్థాయిలో రూ. 22.68 కోట్లకుపైగా వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 20.38 కోట్లకుపైగా లాభాలు వచ్చినట్లు సమాచారం.

No comments:

Post a Comment