విజయం దిశగా దూసుకుపోతున్న నెతన్యాహు

Telugu Lo Computer
0


ఇజ్రాయిల్ సార్వత్రిక ఎన్నికల్లో విజయం దిశగా  బెంజిమిన్ నెతన్యాహుదూసుకుపోతున్నారు. ఇజ్రాయిల్ కు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న ఆయన మరోసారి ఎన్నికల్లో విజయం సాధించనున్నారు. గురువారం అక్కడ బ్యాలెట్ లెక్కింపు ప్రారంభం అయింది. 87.6 శాతం ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి నెతన్యాహు లికుడ్ పార్టీ, దాని మిత్రపక్షాలు 65 స్థానాలు సాధించే స్థితికి చేరుకుంది. ఇందులో లికుడ్ పార్టీనే 61-62 సీట్లు సాధించి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం 120 స్థానాలు ఉన్న ఇజ్రాయిల్ అసెంబ్లీలో 61 స్థానాలు సాధించిన పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది. గత నాలుగేళ్లలో ఇజ్రాయిల్ లో జరుగుతున్న ఐదవ సాధారణ ఎన్నికలు ఇవి. 2015తో పోలిస్తే ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఎక్కువగా పోలింగ్ నమోదు అయింది. జాతీయ భావాలు ఉన్న రైటిస్ట్ పార్టీ అయిన లికుడ్ పార్టీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారు. గతంలో అధికారంలో ఉన్న యాయిర్ లాపిత్, నఫ్తాలీ బెన్నెట్ ల సంక్షీర్ణ ప్రభుత్వంపై ఇజ్రాయిల్ ప్రజల్లో అసంతృప్తి ఉంది. దీంతో 73 ఏళ్ల బెంజిమిన్ నెతన్యాహూ లికుడ్ పార్టీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టబోతున్నారు. లిఫ్ట్ పార్టీలు దాని మిత్ర పక్షాలకు కలిసి కేవలం 54-55 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే నెతన్యాహూకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయి. ఇజ్రాయిల్ లో 2019 నుంచి రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడింది. లంచ, మోసం, విశ్వాస ఉల్లంఘన ఆరోపణలతో నెతన్యాహు పదవి నుంచి దిగిపోయారు. ఆ తరువాత యాయిర్ లాపిత్ ఇజ్రాయిల్ ప్రధాని అయ్యారు. నఫ్తాలీ బెన్నెట్, అరబ్ పార్టీల సహకారంతో ఆయన లాపిత్ పదవిని చేపట్టారు. మితవాద పార్టీ వ్యక్తి అయిన లాపిత్ పాలనలో ఇజ్రాయిల్ రక్షణ, పెరుగుతున్న ద్రవ్యోల్భనంపై అక్కడి ప్రజల్లో భయాలు పెరిగాయి. దీంతోనే ప్రజలు అధికార మార్పును కొరుకున్నట్లుగా తెలుస్తోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)