టీ20లో 15 బంతుల్లో గెలుపొందిన కెన్యా

Telugu Lo Computer
0


ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్‌లో కెన్యా 10 వికెట్ల తేడాతో మాలి జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో కెన్యా అద్భుత విజయాన్ని అందించడమే కాదు, ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టింది. నిజానికి టీ20 ఇంటర్నేషనల్‌లో బంతుల పరంగా కెన్యాకి ఇది అతి పెద్ద విజయం. మాలి ఇచ్చిన లక్ష్యాన్ని కెన్యా కేవలం 15 బంతుల్లోనే సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మాలి జట్టు కేవలం 30 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఆరుగురి బ్యాటర్లు తమ ఖాతా కూడా తెరవలేదు. కేవలం ఒక్కరు మాత్రం రెండంకెల స్కోర్ చేయగలిగాడు. దీంతో ఆ జట్టు 64 బంతులకే కుప్పకూలింది. మాలి జట్టు నిర్దేశించిన ఆ స్వల్ప లక్ష్యాన్ని కెన్యా కేవలం 15 బంతుల్లోనే చేదించి టీ20ల్లో అతి పెద్ద విజయాన్ని అందుకుంది. ఓపెనర్ కాలిన్స్ ఒబుయా 6 బంతుల్లో 18 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అటు మరో ఓపెనర్ పుష్కర్ శర్మ 14 పరుగులు చేశాడు. ఇక మాలి జట్టును బెంబేలెత్తించిన కెన్యా బౌలర్ పీటర్ లాంగట్ 17 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు తీశాడు. కాగా, ఈ విజయంతో కెన్యా ప్రపంచ రికార్డు సృష్టించింది. అంతకుముందు టర్కీని 104 బంతుల్లోనే ఓడించిన ఆస్ట్రియా అతి తక్కువ బంతుల్లో గెలిచిన రికార్డు సొంతం చేసుకోగా.. ఇప్పుడు ఆ రికార్డును కెన్యా బ్రేక్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)