స్పైస్‌జెట్‌పై ఆంక్షలు ఎత్తివేత !

Telugu Lo Computer
0


డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్ పై ఇటీవల విధించిన అన్ని ఆంక్షలను  ఎత్తివేసింది. అక్టోబర్ 30 నుంచి స్పైస్‌జైట్ సర్వీసులు పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కాలంలో స్పైస్‌జెట్ విమానాల్లో తరచు సాంకేతిక లోపాలు తలెత్తడంతో డీజీసీఏ పలు ఆంక్షలు విధించింది. 50 శాతం సర్వీసులను మాత్రమే నడపాలంటూ ఆంక్షలు విధించింది. ఇంజిన్ ఆయిల్ శాంపుల్స్‌ను విశ్లేషించాలని ఆదేశాలిచ్చింది. తాజాగా, స్పెస్‌జెట్ విమాన సర్వీసులను అక్టోబర్ 30 నుంచి పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. సిక్కింలోని పాక్యాంగ్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్ ఫీల్డ్ నుంచి రోజువారీ విమానాలను నడుపుతున్న ఏకైక విమాన సంస్థ అయిన స్పైస్ జెట్ నిర్వహణా ఇబ్బందుల దృష్ట్యా ఈ సర్వీసులను అక్టోబర్ 30 నుంచి నిలిపివేస్తున్నట్టు శుక్రవారం ఉదయం ప్రకటించింది. స్పైస్ జెట్ నిర్ణయాన్ని రాష్ట్ర అధికారులు తప్పుపట్టారు. ఇందువల్ల రాష్ట్ర పర్యాటక పరిశ్రమకు గట్టి దెబ్బ తగులుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏ తాజా ఆదేశాలు స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌కు ఊరట కలిగించినట్టు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)