అలెస్ బైలియాట్ స్కీతో పాటు రెండు మానవ హక్కుల సంఘాలకు నోబుల్ శాంతి బహుమతి - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 7 October 2022

అలెస్ బైలియాట్ స్కీతో పాటు రెండు మానవ హక్కుల సంఘాలకు నోబుల్ శాంతి బహుమతి


బెలారస్ దేశానికి చెందిన ప్రముఖ మానవ హక్కుల ఉద్యమకారుడు అలెస్ బైలియాట్ స్కీ, రష్యాకు చెందిన మానవ హక్కుల సంస్థ ‘మెమోరియల్’, ఉక్రెయిన్ మానవ హక్కుల సంస్థ ‘సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్’ లను 2022 సంవత్సరానికి గాను నోబుల్ శాంతి బహుమతి కి  ఎంపిక చేశారు. తమ దేశాల్లో పౌర సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ అందిస్తోన్న సేవలకు గానూ ఈ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ కమిటీ పేర్కొంది. అలెస్ బిలియాట్స్కీతో పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఎన్నో ఏళ్లుగా అధికారాన్ని విమర్శించే హక్కును ప్రచారం చేయడంతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. తమ దేశాల్లో ప్రజలకు ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కు పట్ల అవగాహన కల్పించడం, ప్రోత్సహించడం, పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడం వంటి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తులకు, సంస్థలకు శాంతి బహుమతి ఇస్తామని ఈ సందర్భంగా కమిటీ వివరించింది. యుద్ధ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, అధికార దుర్వినియోగం వంటివాటిపై పత్రాలు సమర్పించడంలో ఎంతగానో కృషి చేశారని పేర్కొంది. శాంతి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో పౌర సమాజ ప్రాముఖ్యతను చాటి చెప్పారని నోబెల్ కమిటీ చెప్పింది. ఆయా కారణాల వల్ల అలెస్ బిలియాట్స్కీతో పాటు పాటు రష్యా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ మెమోరియల్, ఉక్రెయిన్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ కు సంయుక్తంగా ఈ అవార్డు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది శాంతి బహుమతి విజేతలు యుద్ధ నేరాలను నమోదు చేయడం, మానవ హక్కుల ఉల్లంఘనలు, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడం ద్వారా అమోఘమైన కృషి చేశారని నోబెల్ కమిటీ కొనియాడింది. శాంతి, ప్రజాస్వామ్యం నెలకొల్పడంలో పౌర సమాజం పాత్ర ప్రాముఖ్యతను వారు చాటి చెప్పారని వివరించింది.

No comments:

Post a Comment